Testimonials
Our goals align with your expectations.
Discover insights from Telugu language specialists on our educational resources.
ఆచార్య శివా రెడ్డి, Vice chancellor.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
రాచకొండ మల్లికార్జున రావు గారు విదేశాలలో ఉంటూ తెలుగులో అక్షర పరిచయం (Book 1 & 2) అనే పుస్తకాలను ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా, చాలా శక్తివంతంగా రాశారు.
ఇంత గొప్ప భాష నేచుకుందుకు విదేశాలలో ఉన్నవారికి తెలుగు నేర్చుకునేందుకు మంచి వాచకాలు ఎవరి సహాయము లేకుండా కూడా నేర్చుకునేందుకు వీలుగా రాసిన మల్లికార్జున రావు గారి ప్రయత్నం సఫలమైనదని నా ఉద్దేశ్యం.
★ ★ ★ ★ ★
ఆచార్య థోమసయ్య, Registrar.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
తెలుగు నేర్చుకోడానికి చాలా పుస్తకాలు market లో ఉన్నాయి. కానీ ఇంకా మరెన్నో పుస్తకాలు కావలసిన అవసరం ఎంతైనాఉంది. తెలుగు 1st, 2nd, 3rd language గా నేర్కుకునేందుకు, లేదా వివిధ దేశాల్లో అక్కడి సాంస్కృతులను దృష్టిలో పెట్టుకుని తెలుగు పూస్తకాలు తయారు చేతవలసిన అవసరం ఎంతైనాఉంది.
అక్షర పరిచయం (రెండు) పుస్తకాల్లో కేవలం అక్షరాలేకాదు, పదాలు, వాక్యాలు నేర్చుకోవడానికి వీలుగా అంశాలు ఉన్నాయి. ఈ రెండు పుస్తక్లాల్లో వాక్యాలు కూర్చడం, మాట్లాడడం పొందుపరచారు. ఈ రెండు పుస్తకాల తర్వాత విద్యార్థులు తెలుగులో మాట్లాడగలరని వారి ఉడ్డేశ్యము. పుస్తకాలలో విద్యార్థులకు ఆసక్తికరంగా గేయాలను, కథలను, పద్యాలను పొందుపరిచారు.
ఐతే, ఈ పుస్తకాలకి, market లో ఉన్న పుస్తకాలకి ఏమిటి వ్యత్యాసం అని గమనించినట్లైతే
- ఈ పుస్తకాలని విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండేలాగున తయారుచేశారు.
- పలికే విధానం ఆధారంగా ధ్వనిసూత్రాలు ఉంటాయి. దాని ఆధారంగా అక్షరాలు నేర్పుతారు. దీనికి భిన్నంగా shape similarity method ద్వారా నేర్చుకోవడం ఒక పద్ధతి. ఇక్కడ ధ్వని సూత్రాలు ఉండవు. అక్షరాల రూపాలను ఆధారంగా గ్రూప్ చెయ్యడం (ఉ. ళ, శ) వాటి నుండి అక్షరాలు నేర్పడం జరుగుతుంది.
- అదే కాకుండా అక్షరాలు దిద్దటం తో అక్షరాలను నేర్పిస్తాం. మరొక పద్ధతి పదాలతో అక్షరాలను నేర్చుకోవడం. అక్కడ మనం అక్షరాలతో కాకుండా ముందు పదాలతోనే అక్షరాలను దిద్దిస్తాం. వాటికి అర్థం చెప్పుకుంటూ రాయడం నేర్పుతాం. అక్షరాలు వరుసక్రమంలో ఉండవు. ఆవిధంగా విద్యార్థులకు ఆసక్తికరంగా ఉంటుంది. అక్షరాలతో మొదలు పెట్టినప్పుడు చాలా dull గా, విసుగ్గా ఉంటుంది. పదాలతోనే అక్షరాలను దిద్దిస్తే ఆ boredom ఉండదు.
★ ★ ★ ★ ★
ఆచార్య మునిరత్నం నాయుడు,
Head of Mandali Venkata Krishna Rao International Telugu Centre
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
★ ★ ★ ★ ★