Practice Dialogue

DO NOT REVEAL SUGGESTED ANSWERS BEFORE TRYING

Situation Description - Domain: Centrelink

This is a dialogue between a Centrelink Officer (CO) and a grandparent (GP) who is caring their grandchildren. The grandparent is enquiring about any financial assistance they could get from the government.

CO1>

Sorry about the wait, how can I help you?

{Interpret in Telugu}

GP1>

నా కొడుకు, కోడలు ఇటీవల విడిపోయారు. నా మనవళ్లు, నాతో, నా భర్తతో  నివసిస్తున్నారు. మేము పదవీ విరమణ పొందాము. మేము ఏదైనా ఆర్థిక సహాయం పొందగలమా అని తెలుసుకోవాలనుకుంటున్నాను.

{Interpret in

ENGLISH}

CO2>

How long have your son and his wife been separated, and how long have the children been living with you?

{Interpret in Telugu}

GP2>

సుమారు 3 నెలలు. నా మనవళ్లకు 7, 4 సంవత్సరాలు. నా మనవరాలికి 5 సంవత్సరాలు. పెద్ద అబ్బాయి బడికి వెళ్తాడు మరియు నా మనవరాలు వచ్చే ఏడాది బడి ప్రారంభిస్తుంది.

{Interpret in

ENGLISH}

CO3>

That must be very tiring for you. Where are your son and daughter-in-law? Do you have custody of the children?

{Interpret in Telugu}

GP3>

నా కొడుకు ఒక్కడికే పిల్లల కస్టడీ ఉంది, కానీ అతను దూరం వెళ్ళే  ట్రక్ డ్రైవర్ కాబట్టి అతను ఎక్కువ కాలం   దూరంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ బ్రిస్బేన్ లో నివసిస్తుంది.

{Interpret in

ENGLISH}

CO4>

You could be eligible for a means-tested Carer Allowance or Carer Benefit if any of your grandchildren is sick or has a disability. Or do you pay childcare fees for your grandchildren?

{Interpret in Telugu}

GP4>

నా మనవళ్లు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, కానీ నేను 4 సంవత్సరాల వాడికి పిల్లల సంరక్షణ ఫీజులు చెల్లిస్తాను. అవి చాలా ఖరీదైనవి. వీలైతే దాని కోసం కొంత సహాయం కోరుకుంటున్నాను.

{Interpret in

ENGLISH}

CO5>

Then the full cost of maximum hours per week of childcare at an approved childcare centre can be paid directly to the centre you if you’d like to apply for that.

{Interpret in Telugu}

GP5>

మీరు చాలా సహాయకారిగా ఉన్నారు, కానీ నాకు మరి వేరే ఎటువంటి ఆర్థిక సహాయానికి అర్హత లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా?

{Interpret in

ENGLISH}

CO6>

Well, Centrelink at Services Australia do have Grandparent Advisors on Free call 1800 245 965, so you might like to give them a ring.

{Interpret in Telugu}

GP6>

నా కొడుక్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లభించదని నాకు తెలుసు. అతను పనిచేస్తున్నప్పటికీ, తను దరఖాస్తు చేసు కోగలిగే ప్రయోజన పథకం ఏదైనా ఉందా?

{Interpret in

ENGLISH}

CO7>

Because your son is the sole custodian of his kids, he might be eligible for the Family Tax Benefit Part A. It’s means tested. He’ll need to report regularly on any changes to his income or circumstances.

{Interpret in Telugu}

GP7>

చాలా ధన్యవాదాలు మీరు చాలా సహాయపడ్డారు. నేను ఆలోచించడానికి మీరు చాలా సమాచారం ఇచ్చారు. నేను ఖచ్చితంగా కనుక్కుంటాను.

{Interpret in

ENGLISH}

CO1>

Sorry about the wait, how can I help you?

మీరు వేచి ఉండవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. నేను మీకు ఎలా సహాయం చేయగలను?

GP1>

నా కొడుకు, కోడలు ఇటీవల విడిపోయారు. నా మనవళ్లు, నాతో, నా భర్తతో  నివసిస్తున్నారు. మేము పదవీ విరమణ పొందాము. మేము ఏదైనా ఆర్థిక సహాయం పొందగలమా అని తెలుసుకోవాలనుకుంటున్నాను.

My son and daughter-in-law have recently separated, and my grandchildren are living with my husband and me. We’re retired and want to know if we can get any financial help?

CO2>

How long have your son and his wife been separated, and how long have the children been living with you?

మీ కొడుకు అతని భార్య ఎంత కాలంగా విడిపోయారు? అలాగే, ఎంత కాలంగా పిల్లలు మీ వద్ద నివసిస్తున్నారు?

GP2>

సుమారు 3 నెలలు. నా మనవళ్లకు 7, 4 సంవత్సరాలు. నా మనవరాలికి 5 సంవత్సరాలు. పెద్ద అబ్బాయి బడికి వెళ్తాడు మరియు నా మనవరాలు వచ్చే ఏడాది బడి ప్రారంభిస్తుంది.

About 3 months. My grandsons are 7 and 4 and my granddaughter is 5. The older boy goes to school and my granddaughter starts next year.

CO3>

That must be very tiring for you. Where are your son and daughter-in-law? Do you have custody of the children?

అది మీకు చాలా అలసట కలిగించవచ్చు! మీ కొడుకు, కోడలు ఎక్కడ ఉన్నారు? మీకు పిల్లల సంరక్షణ ఉన్నదా?

GP3>

నా కొడుకు ఒక్కడికే పిల్లల కస్టడీ ఉంది, కానీ అతను దూరం వెళ్ళే  ట్రక్ డ్రైవర్ కాబట్టి అతను ఎక్కువ కాలం   దూరంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ బ్రిస్బేన్ లో నివసిస్తుంది.

My son has sole custody, but he is a long-distance truck driver and so he is away a lot. Their mother lives in Brisbane.

CO4>

You could be eligible for a means-tested Carer Allowance or Carer Benefit if any of your grandchildren is sick or has a disability. Or do you pay childcare fees for your grandchildren?

మీ మనమలలో ఎవరైనా జబ్బు పడ్డా లేదా వైకల్యము కలిగి ఉన్నా, మీ రాబడిని బట్టి, సంరక్షకుల భత్యం లేదా సంరక్షకుల ప్రయోజనము పొందడానికి అర్హత ఉంటుంది. లేదా, మీరు మీ మనవలకు పిల్లల సంరక్షణ ఫీజు కడుతున్నారా?

GP4>

నా మనవళ్లు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, కానీ నేను 4 సంవత్సరాల వాడికి పిల్లల సంరక్షణ ఫీజులు చెల్లిస్తాను. అవి చాలా ఖరీదైనవి. వీలైతే దాని కోసం కొంత సహాయం కోరుకుంటున్నాను.

My grandchildren are all healthy, but I do pay childcare fees for the 4-year-old. They’re quite expensive. I’d like some help with that if I can.

CO5>

Then the full cost of maximum hours per week of childcare at an approved childcare centre can be paid directly to the centre you if you’d like to apply for that.

అలా అయితే, మీరు అర్జీ పెట్ట దలచినట్లయితే, వారానికి అత్యధిక గంటల సంరక్షణకు అయ్యే మొత్తం డబ్బుని, గుర్తించబడ్డ పిల్లల సంరక్షణ కేంద్రానికి, మీ బదులు నేరుగా జమా చేయబడుతుంది. 

GP5>

మీరు చాలా సహాయకారిగా ఉన్నారు, కానీ నాకు మరి వేరే ఎటువంటి ఆర్థిక సహాయానికి అర్హత లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా?

You’ve been quite helpful, but are you sure that I’m not eligible for any more financial support?

CO6>

Well, Centrelink at Services Australia do have Grandparent Advisors on Free call 1800 245 965, so you might like to give them a ring.

Centrelink, Service Australia లో Grandparent Advisors ఉన్నారు. కావాలనుకుంటే వారిని మీరు 1800 245 965 పై ఉచితంగా సంప్రదించవచ్చు. 

GP6>

నా కొడుక్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లభించదని నాకు తెలుసు. అతను పనిచేస్తున్నప్పటికీ, తను దరఖాస్తు చేసు కోగలిగే ప్రయోజన పథకం ఏదైనా ఉందా?

I know my son doesn’t get any help from the government. Is there any benefit he could apply for even if he’s working?

CO7>

Because your son is the sole custodian of his kids, he might be eligible for the Family Tax Benefit Part A. It’s means tested. He’ll need to report regularly on any changes to his income or circumstances.

మీ కొడుకు పిల్లలకు ఏకైక సంరక్షకుడు కాబట్టి, తాను Family Tax Benefit Part A కి అర్హుడు కావచ్చు. అది రాబడి పై ఆధార పడి ఉంటుంది. తన రాబడిలోను లేదా పరిస్థితులలో మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయ్యాలి.

GP7>

చాలా ధన్యవాదాలు మీరు చాలా సహాయపడ్డారు. నేను ఆలోచించడానికి మీరు చాలా సమాచారం ఇచ్చారు. నేను ఖచ్చితంగా కనుక్కుంటాను.

Thank you very much you have been very helpful. You’ve given me a lot to think about and I’ll certainly check it out.