Sanatana Dharmamu Telugu (Paperback)

Sanatana Dharmamu Telugu (Paperback)

$29.00

ISBN ‎ 979-8896733911

Paperback Pages: 282 Size: 20.3×12.7×1.4 cm Weight: 290 grams

సనాతన ధర్మము మానవుడు తన జీవిత లక్ష్యాలైన ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాల సాధనలో ఉత్తేజపూర్వకంగాను సంతృప్తికరంగాను జీవనాన్ని గడపడానికి జీవన విధానాన్ని వివరణాత్మకంగా సూచిస్తుంది.
‘బ్రహ్మమొక్కటే, రెండవది లేదు’ అనే అద్వైత సూత్రం సరళమైనది, కానీ అంతుపట్టనిది. సనాతన జీవన విధానం వ్యక్తియొక్క బుద్ధిని తన ప్రస్తుత స్థితి నుండి క్రమేణా ఆ ఏకత్వాన్ని కనుగొనే దారిలో నడిపిస్తుంది. వైదిక వాఙ్మయాన్ని శోధించి రచించిన ఈ పుస్తకం ప్రాచీన గ్రంథాల నుండి ఆసక్తికరమైన అనేక ఉపాఖ్యానాల ద్వారా గూఢమైన సనాతన ధర్మ విషయాలను ఆధునిక జీవన విధానంతో, సాంకేతికతతో పోలుస్తూ విపులీకరిస్తుంది.
గ్రంథం మొదటి భాగం సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పరిశీలిస్తూ, నేటి సమాజంలో అర్ధ, కామ పురుషార్థాల సాధనలో ధర్మమార్గము యొక్క ఆవశ్యకతను, ఔచిత్యాన్ని చూపుతుంది. ఇది నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో రాజీపడకుండా ఆర్థిక విజయాన్ని, వ్యక్తిగత సంతృప్తిని సాధించడంపై ఆచరణాత్మక దృష్టితో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది.
రెండవ భాగం మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యమైన మోక్షంపై నిగూఢ అంశాలను సహేతుకంగాను ఆచరణాత్మకంగాను అందిస్తుంది. పునర్జన్మ చక్రం నుండి విముక్తి మార్గాన్ని అన్వేషిస్తుంది, అందరిలో ఏకత్వం, ఆత్మసాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక స్వేచ్ఛ గురించిన లోతైన అవగాహనను కలిగిస్తుంది.

Available on back-order

Category:

రచయిత: రాచకొండ మల్లికార్జున రావు JP. M.Sc., M.A.

రాచకొండ మల్లికార్జున రావు విశ్రాంత IT ఉద్యోగి. ఆయన ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో అనేక CEO వంటి హోదాలలో పనిచేశారు. సాంఘిక సేవకుడిగా చిన్మయా మిషన్ వంటి అనేక సంస్థలలో వివిధ హోదాల్లో స్వచ్ఛంద సేవలందించారు. సిడ్నీలో బాలల తెలుగు భాషా పాఠశాలలను గణనీయంగా బలోపేతం చేసారు. తన స్వచ్ఛంద సేవలకు గాను అనేక కమ్యూనిటీ అవార్డులను అందుకున్నారు.

సనాతన ధర్మము‘ అనే ఈ పుస్తకం ఆయన 30 ఏళ్ళుగా అద్వైత వేదాంతంపై ఆధునిక విశ్లేషణా పద్ధతులను ఉపయోగించి చేసిన లోతైన పరిశోధనా ఫలితం. తెలుగు, ఆంగ్ల భాషల్లోని ఆయన ఈ రచన, వేదాంత విషయాలు ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఎలా ప్రతిఫలిస్తాయో చూపే దర్పణం.

Reviews

There are no reviews yet.

Be the first to review “Sanatana Dharmamu Telugu (Paperback)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Sanatana Dharmamu Telugu (Paperback)
$29.00

Available on back-order