Chinnachoopu – చిన్నచూపు

చిన్నచూపు - కథానిక

[gspeech type=circle]

ఎండ నడి నెత్తికి ఎక్కింది.
“పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం” అంటూ తన తోపుడు బండి నెట్టుకుంటూ కేక వేస్తోంది సూరమ్మ.
సూరమ్మ 28 సంవత్సరాల యువతి. ఆరు నెలల గర్భిణి. తన భర్త ఆటో నడుపుతాడు. చిన్న తరగతి కుటుంబం మూలాన భర్తకు ఆసరాగా ఉంటుందని పాత పేపర్ల వ్యాపారం చేస్తోంది సూరమ్మ.
అది వేసవి కాలం. మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. గర్భిణి కావడంతో పేపర్లతో నిండిన బండిని ఆయాసంగా తోస్తోంది. మధ్యాహ్నం భోజనసనికి ఇంటికి వెళ్ళే ముందు ఈ ఆఖరు వీధి తిరిగుదామనుకొని కేక వేస్తూ నడుస్తోంది.
“ఓ పేపర్ అమ్మాయ్! ఇలా రా!” అంటూ మాట వినిపించింది. పక్క సందు మధ్యలో ఒక గుమ్మం ముందు నిలుచుని ఒకావిడ పిలుస్తోంది.
“వస్తున్నానమ్మా” అంటూ సందువైపు బండి తిప్పింది సూరమ్మ. ఆ సందులో స్కూటర్లు సైకిళ్ళూ రెండు పక్కలా నిలిపి ఉన్నాయి. బండి పట్టదని దాన్ని సందు మొగలో వదిలి, ఒక గోనె సంచీ, తక్కెడ తీసుకుని ఆ ఇంటి వైపు నడిచివెళ్ళింది సూరమ్మ.
ఆవిడ పాత పత్రికలు, పుస్తకాల కట్టలు చూపించింది. బేరం ఆడుకుని, తూకం వేసి డబ్బు అందించి ఆ తట్టాలని తన గోనె సంచీలోకి ఎత్తుకుంది. ఆమె వెడుతుండగా “పాత అట్ట పెట్టెలు ఉన్నాయి. అవి కూడా కొంటావా?“ అని అడిగిందామే. “కొంటానమ్మా” అంది సూరమ్మ. “ఐతే ఉండు తీసుకు వస్తాను” అందావిడ. “ఈ లోగా నేను ఈ సంచీ బండిలో పడేసి వస్తానమ్మగారు” అంటూ గోనె సంచీ మూటను భుజాన్న వేసుకుని వెళ్ళింది సూరమ్మ బండి దగ్గరకి.
ఈ లోగా ఆవిడ table కింద పడున్న అట్ట పెట్టెల కట్ట తీసుకు వచ్చింది. సూరమ్మ రాకముందే గుమ్మం పక్కన పడున్న ఒక నాపరాయి ముక్కని కట్ట మధ్యలోకి కనపడకుండా దోపేసింది.
సూరమ్మ మరొక ఖాళీ సంచీతో వచ్చింది. తూకం వేసుకును బేరమాడి ఒప్పుకున్న డబ్బు చెల్లించింది. మూట భుజాన వేసుకును బండి వైపు నడవసాగింది.
ఈ లోగా ఒక యువకుడు మంచి పాంటూ, షర్టు వేసుకుని ఎదురొచ్చాడు. ఇరుకు సందు మూలంగా సూరమ్మ సంచీ అతని షర్ట్ కి తాకింది. కోపంగా రుస రుస లాడుతూ చూశాడు. సూరమ్మ పట్టించుకోకుండా నడిచింది.
బండిలో అట్ట పెట్టెల మూట సర్ది పెడుతుంటే, దాంట్లోంచి నాపరాయి ముక్క జారి కింద పడింది. “ఆమెను నమ్మి చూసుకోకుండా మూట ఎత్తుకున్నాను. ఈ రాయి మూలంగా ఒక కిలో డబ్బు ఊరికే పోయింది” అనుకుంటోంది సూరమ్మ బాధగా. “ఇంకెన్ని రాళ్ళు మూట కట్టిందో ఆ మహాతల్లి చూద్దాం!” అని కట్ట విప్పింది సూరమ్మ. అందులో ఒక చిన్న ఎర్ర డబ్బా రంగు కాగితం, రిబ్బన్ కట్టి కనిపించింది.
సూరమ్మ ఆవిడ ఇంటికి మళ్ళీ వెళ్ళి తలుపు కొట్టింది. “ఏం కావాలి?” అని అడిగినది అసహనంగా. “అమ్మగారు, ఇది కట్టలో కనబడింది. ఏదో పనికొచ్చేదేమోనని తీసుకు వచ్చా. చూడండి” అని ఎర్ర డబ్బాను ఆమెకు చూపించింది. ఆమె వెనకనే ఇందాకా తనపై రుసరుసలాడినాయన దాన్ని చూసి “ఇది నీకు ఎక్కడిది?” అని అడిగాడు ఆశ్చర్యంగా. “ఇప్పుడే అమ్మగారు పాత అట్ట పెట్టెలు అమ్మేరు. అందులో దొరికింది సార్” అని చెప్పింది సూరమ్మ. ఆయన టేబల్ కిందకు తిరిగి చూస్తే అక్కడ అట్ట పెట్టెల మూట లేదు. ఆ రోజు వాళ్ళ anniversary. భార్యను surprise చేద్దామని ఆ ముందు రోజే ఒక బంగారు గొలుసు కొని దాన్ని ఆ మూటలో భద్రంగా దాచాడు.
సూరమ్మ చేతిలోంచి ఎర్ర డబ్బాను ఆత్రంగా అందుకున్నాడాయన “బతుకు జీవుడా” అన్న feeling తో.
“ఇది కూడా ఆ కట్ట లోనే దొరికింది అమ్మగారు” అని ఆమె చేతికి నాపరాయిని ముక్కని అందించిది సూరమ్మ.
ఖిన్నురాలై అందుకుంది ఆ రాయిని సిగ్గుతో ఆమె. 

Shopping Cart